
నమాజ్ నేర్చుకోవడానికి ఇండోనేషియా నుంచి కరీంనగర్ రావడం ఏమిటి? విచిత్రం కాకపోతే. దీని వెనుక ఏదో భారీ కుట్ర ఉండి ఉండే అవకాశం ఉంది. అయితే ఆ ఇండోనేషియా బృందానికి ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయలేదా? మరి అప్పుడు ఎందుకు తేలలేదు? అది కూడా ఓ బిలియన్ డాలర్స్ ప్రశ్న. ఎందుకంటే మొన్న ఇటలీ నుంచి నెల్లూరు కు వచ్చిన కుర్రాడిక్కూడా ఎయిర్ పోర్టులో నెగటివ్ వచ్చిందట. నెల్లూరుకు వచ్చాక అనారోగ్యం వచ్చి పరీక్షిస్తే అప్పుడు పాజిటివ్ అని తేలింది. దీనిని బట్టి ఏం తెలుస్తోంది? పరీక్షల ద్వారా ఖచ్చితంగా నిర్ధారించలేము అనే కదా? మరి అలాంటప్పుడు విదేశాల నుంచి వచ్చేవారిని భారత్ కి అనుమతించడం ఎందుకు?
వచ్చారు సరే. వచ్చినందుకు వాళ్లు చెప్తున్న కారణం బహు చిత్రంగా ఉన్నది. వాళ్లు ఇండోనేషియా నుంచి భారత్ కి నమాజ్ నేర్చుకోవడానికి వచ్చారట. ఇప్పుడు కరోనా సోకి చావు బ్రతుకుల్లో ఉన్నవాడి వయసు 58 సంవత్సరాలట. అసలు నమాజ్ నేర్చుకోకుండా ఇన్ని రోజులు ముస్లిం మెజారిటీ దేశం ఇండోనేషియాలో ఆయన ఏం చేస్తున్నట్టు?
ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 150 మంది టీం కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించేస్తున్నారు. అసలు మన పల్లెల్లో వీళ్ళకి ఏం పని? వీళ్ళకిక్కడ నమాజ్ నేర్పే వాళ్ళు ఎవరున్నారు? వారు నమాజ్ నేర్చుకునే ముసుగులో గ్రామీణ ముస్లిం యువత హృదయాలలో తీవ్రవాద భావజాలాన్ని చొప్పించడానికి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా?
ఇంకొక ఆందోళనకరమైన వార్త. అదే కరీంనగర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటిక్స్ పేరుతో ఒక విద్యా సంస్థను నిర్వహిస్తున్న జమీల్ అహమద్ అనే వ్యక్తి అనేక రాష్ట్రాలలో నిషేదించబడ్డ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా నాయకుడు. ఇతను కోచింగ్ సెంటర్ ముసుగులో కొంత మంది యువకులలో PFI భావజాలాన్ని నింపి బెంగళూరు వంటి ప్రాంతాలకు పంపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇది ఒక రోజులో జరిగేది కాదుగా? కనీసం కొన్ని నెలలుగా జరుగుతూ ఉండుండాలి కదా? మరి ఇన్ని నెలలుగా/సంవత్సరాలుగా నిఘా సంస్థలు నిద్ర పోతూ ఉండినాయా?
అదే నిజమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల అనుసరిస్తున్న ఉదారవాద వైఖరే అందుకు కారణం. ఈమధ్య భైంసాలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కొందరు ముస్లింలు హిందువులపై దాడి చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేసి, ఇళ్లను సైతం తగులబెట్టారు. నిజానికి ప్రభుత్వానికి ప్రజల రక్షణ పై బాధ్యత ఉంటే, ఆ విధ్వంసానికి కారణమైన వారిపై సరైన చర్యలు తీసుకుని ఉంటే మరళా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. కానీ దురదృష్టవశాత్తూ సీఎం కేసీఆర్ బైంసా ఘటనను ఏదో చిన్న తగాదాగా తేల్చి పడేశారు. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి నిజానిజాల నిగ్గు తేల్చాలన్న స్పృహ లేదు. మరోవైపు ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో హిందూ సమాజంపై అత్యంత క్రూరమైన రీతిలో దాడులు జరిగినా ఇక్కడ సీఏఏ ముస్లిములకు వ్యతిరేకమంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు కేసిఆర్. అంతటితో ఆగారా? సీఏఏను వ్యతిరేకిస్తూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానమే చేసి పడేశారు. హిందువులకు వ్యతిరేకంగా ఏం చేసినా హిందువులు సంఘటితం కారని, ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించి ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటే తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని కేసీఆర్ లాంటి కుహనా సెక్యులర్ లకు ప్రగాఢ నమ్మకం.
ఇప్పుడు ఈ ఇండోనేషియా టీం విషయంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం, వారి అధీనంలోని పోలీసులు సరిగ్గా వ్యవహరించి, నిజాలను నిగ్గు తేల్చి ప్రపంచానికి వెల్లడిస్తారన్నది కల్ల. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాల్సిందే. లేకపోతే మన కేసీఆర్ సారు వచ్చిన వాళ్ళు శాంతి ప్రబోధకులని తేల్చేసి కేసే లేకుండా తుస కొట్టగల సమర్థులు.
ఇప్పుడు అన్నిటికంటే ముందు తేలవలసింది వారిలో ఎంతమందికి కరోనా ఉంది? ఎక్కడెక్కడ తిరిగారు? ఎంతమందిని కలిశారు? వారు కలసిన వారిలో ఎంతమందికి కరోనా సోకింది? అనేది తేల్చాల్సి ఉంది. కనీసం వారందరినీ గుర్తించి మన కేసీఆర్ సారు చెప్పినట్లు పారాసెటమాల్ బిళ్ళలైనా మింగించాలి కదా? ఇలా ప్రతి దాన్నీ తేలిగ్గా కొట్టిపారేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అంతా అయిపోయాక ఎవరో ఒకరి నెత్తిన అభాండాలు వేయడం కేసీఆర్ గారికి రివాజు అయిపోయింది. అది ఇస్లామిక్ ఉగ్రవాదం అయినా సరే, కరోనా మహమ్మారి అయినా సరే.
కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుల ఇలాంటి వైఖరికి ప్రధాన కారణం హిందువుల తీరే. అవును కులం చూసో, ప్రాంతం చూసో, బంధుత్వం చూసో, ఉచిత పథకాలు చూసో ఓట్లేసే హిందువుల తీరే ప్రధాన కారణం. తమ కళ్ల ముందు ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, తాము భక్తితో కొలిచే దేవీ దేవతల పట్ల ఎంత అపచారం జరుగుతున్నా, సెక్యులర్ నాయకుల మైనారిటీ సంతుష్టీకరణ విధానాల వల్ల హిందూ ధర్మానికి, భారతదేశానికి ఎంత అపకారం జరుగుతూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించే హిందువుల వైఖరే ముమ్మాటికీ కారణం. హిందువులు మేలుకున్న నాడే దేశానికి నిజమైన మేలుకొలుపు. అదే నిజమైన మేలు మలుపు.





