
టీసీఎస్ నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెసీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యురాలు అశ్విని చైనానికి స్థానిక కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. టీసీఎస్ లో అంత జరుగుతున్నా అశ్వినీ అసలు చర్యలు తీసులేదని, పైగా వేధింపులకు ఆస్కారం కల్పించిందని కోర్టు వ్యాఖ్యానించింది.
అదనపు సెషన్స్ జడ్జి వి.వి. కథారే, పిటిషన్‌ను తిరస్కరిస్తూ, చైనాణి ప్రవర్తనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.regional Human Rights executive లాంటి కీలక బాధ్యతల్లో వుండి కూడా ఆమె మౌనం వహించిందని, ఆమె సున్నితత్వం కూడా నిందితుల చర్యలను సమర్థించే విధంగా వుందని, కళ్లెదుటే ఇంత ఘోరమైన పరిస్థితి వున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరించిందని కోర్టు మండిపడింది.
పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కార) చట్టం, 2013 (సాధారణంగా POSH చట్టం అని పిలుస్తారు) కింద ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీలో చైనాణి సభ్యురాలు. బాధితులు ఫిర్యాదులు దాఖలు చేయడంలో వారికి సహాయపడటం మరియు సకాలంలో పరిష్కారం అందేలా చూడటం ఈ చట్టం ప్రకారం కమిటీ సభ్యుల చట్టబద్ధమైన బాధ్యత.
ఆఫీసులో ఇబ్బందికర పరిణామాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినా.. చైనాణి తన బాధ్యతను నిర్వర్తించలేదని, చర్యలు తీసుకోవడంలో కూడా విఫలమయ్యారని కోర్టు ఆక్షేపించింది. అంతేకాకుండా నిందితులను వదిలేయాలని ఫిర్యాదుదారులకే సలహా కూడా ఇచ్చిందని కోర్టు పేర్కొంది.వేధింపులకు ప్రేరేపించినట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని, ఆరోపించబడిన వేధింపులు కొనసాగడానికి ఆమె ప్రవర్తన దోహదపడిందని న్యాయమూర్తి కథారే నొక్కిచెప్పారు.
బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, చైనాని దర్యాప్తుకు సహకరించడం లేదని, ఆమెను విడుదల చేస్తే సాక్షులను బెదిరించడం లేదా సాక్ష్యాలను తారుమారు చేయడం జరిగే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనను న్యాయస్థానం అంగీకరించింది.
అరెస్టులో ప్రక్రియాపరమైన లోపాలు జరిగాయని, కస్టడీకి ముందు తగినంత నోటీసు ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, ఆరోపణల తీవ్రత, ఫిర్యాదులను అణచివేయడంలో ఆమె పాత్ర ఉందన్న ఆరోపణల దృష్ట్యా, ఈ వాదనలు సరిపోవని కోర్టు భావించింది.





