
3views
పవిత్ర గంగానదిలో ఎంగిలి మాంసాహార వ్యర్థాలను పడేయడం హిందువుల మతపరమైన విశ్వాసాలను గాయపరుస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలో ఒక పడవపై ఇఫ్తార్ విందు చేసుకుంటూ వ్యర్థాలను నదిలో పడేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ముస్లింలకు బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్ రాజీవ్ లోచన్ శుక్లా ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. తమ చర్యలకు గానూ వీరంతా పశ్చాత్తాపం ప్రకటించారని, ఇతరు లను బాధించినందుకు వారి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారని తెలిపింది. ‘నిందితులకు ఇదివరకు నేర చరిత్ర లేదు. రెండు నెలలుగా వారు జైల్లో ఉన్నారు. పైగా విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఎప్పుడూ ఇలా చేయబోమని రాతపూర్వకంగా తెలిపారు. అందువల్ల బెయిలు ఇస్తున్నాం’ అని ఈ నెల 15న ప్రకటించింది. ఇదే కేసులో మరో ముగ్గురికీ బెయిలు ఇచ్చింది.





