News

ధర్మాచరణకు, పోటీ పరీక్షలకు అస్సలు పడదా? ఎందుకీ వివక్ష?

5views
ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు వచ్చాయంటే చాలు.. హిందూ పరీక్షార్థులకు అవమానాలే అవమానాలు. మరీ ముఖ్యంగా మహిళలకు. మహిళలకు సాంస్కృతిక చిహ్నాలను అపహాస్యం చేసేస్తారు. వాటితో పరీక్షకు ఏదో ఇబ్బందులు వచ్చిపడిపోతాయి,ఫలితాలే తారుమారు అయిపోతాయి అన్న చందంలో తెగ రెచ్చిపోతారు. తాళి గానీ, గాజులు గానీ, మెడలో ఏం ధరించినా.. వాటిని పక్కాగా, పగబట్టి మరీ తీయించేస్తారు. వాటితో పరీక్షలకు వచ్చే ఇబ్బందేమిటో అర్థమే కాదు. ఇవి ప్రతిచోటా జరిగేవే.
తాజాగా.. సూరత్ లో ఓ పరీక్షా కేంద్రంలో NEET పరీక్ష జరుగుతోంది. ఈ సమయంలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తులసి మాల ధరించినందుకు పరీక్షకు వచ్చిన ఓ హిందూ విద్యార్థిని పరీక్షా అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తులసీ మాలను తొలగించాలని బలవంతం చేశారు.
దీనిపై ఆ యువతి తండ్రి తీవ్రంగా స్పందించారు. ‘‘మేము హిందువులం. నేను వున్నది సూరత్ లో . లాహోర్ లో కాదు. కరాచీలోనో, పాకిస్తాన్ లోనూ లేను.మీరు హిజాబ్ ను, బుర్ఖాను తొలగించలేరు గానీ, నా కుమార్తె మెడలోని తులసీ మాలను మాత్రం తొలగించమంటారు.ఈ తెగువ ఎక్కడి నుంచి వచ్చిందో?’’ అంటూ విరుచుకుపడ్డారు.
గతంలో జరిగిన సంఘటనలివీ…
గత నెల 18 వ తేదీన కూడా కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతంలో అచ్చు ఇలాంటి ఘటనే జరిగింది.కర్నాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET) సందర్భంగా విద్యార్థులను తమ యజ్ఞోపవీతాలను తొలగించమని నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో నటరాజ్ భాగవత్ అనే వ్యక్తి అధికారులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించారు.
 
2017 లో కేరళలో జరిగిన NEET పరీక్ష సందర్భంగా కూడా ఇలాంటి వివాదమే రేగింది. సమయంలో కేరళలోని ఒక పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులను కఠినంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థినుల తాళిబొట్లు, అంతర్గత దుస్తుల వరకు తీసివేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారింది.
 
అలాగే అదే సంవత్సరం CBSE పరీక్షలు కూడా జరిగాయి.కేరళలోని కొన్ని కేంద్రాల్లో విద్యార్థినులను తాళిబొట్లు, మెట్టెలు తొలగించమని ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి.
 
నవంబర్ 2023లో, కర్ణాటక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళే ముందు వారి మంగళసూత్రాలు, కాలి మెట్టెలు, చెవిపోగులు, గొలుసులు మరియు ఉంగరాలను తీసివేయాలని అధికారులు కోరారు.