News

భోజనంలో సత్యదేవుని ప్రసాదం పెట్టండి

68views

అన్నవరం సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామి వారి గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టాలని దేవదాయ, ధర్మదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యదేవుని అన్నప్రసాద పథకంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని భక్తులు కోరడంపై గతంలో పెట్టిన ప్రసాదాన్ని ఎందుకు తీసేశారని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు బదులిస్తూ కొందరు వడ్డించిన ప్రసాదాన్ని వదిలేస్తున్నారని వివరించారు. దీనికి మంత్రి మాట్లాడుతూ భక్తులను అడిగే ప్రసాదం పెట్టాలని సూచించారు. వారం రోజుల పాటు భోజనంతో పెట్టి భక్తుల అభిప్రాయాలు కోరాలని, తరువాత స్థానిక ఎమ్మెల్యేతో పథకాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.

ధూప దీప నైవేద్యాలకు రూ.70 కోట్లు
ధూప దీప నైవేద్యాల కింద రాష్ట్రంలో 5,821 గుళ్లకు రూ.70 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి ఆనం తెలిపారు. రూ.200 కోట్ల కామన్‌ గుడ్‌ ఫండ్‌ నిధులతో 194 చిన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఐదువేల భజన మండళ్లకు రూ.700 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.