News

ప్రకృతి వనరుల పరిరక్షణ శబల భోజన పండగ

117views

సేవ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శబల భోజన పండగలకు ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభించడం ప్రకృతి వ్యవసాయంపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని రాష్ట్ర ఫుడ్‌ ప్రొసెసింగ్‌ విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం గోశాల ఆవరణలో జరుగుతున్న శబల భోజన పండగల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ భోజన పండగలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.

శబల భోజనాల పండగలో అతిథులు

  • భారత కిసన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం ఎంతో ఆవశ్యకమన్నారు.
  • ఏయూ విశ్రాంత ఉప కులపతి జీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం విస్తరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం జరిగిన భోజనాల పండగలో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవ్‌ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, మిల్లెట్ రాంబాబు, ఆయుర్వేద వైద్యులు సుందరరాజ పెరుమాళ్, జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర ధామా, వీఎంఆర్‌డీఏ చీఫ్‌ ప్లానర్‌ వి.శిల్ప, వ్యవసాయ శాఖ ఏడీ విజయప్రసాద్, విశాఖ పోర్టు ఉద్యాన అధికారి రాధిక, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలువురు బాలికలు గోపికల వేషధారణలో తరలివచ్చారు. వారికి సేవ్‌ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్‌ పెరుగు చిలికి వెన్న తయారీపై అవగాహన కల్పించారు. చిలికిన వెన్నను చిన్నారులకు తినిపించారు.