News

వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

113views

వీహెచపీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లుటౌన్ పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మోటార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగాగుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బీరప్ప సర్కిల్‌ నుంచికసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సాగింది. బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కో-కన్వీ నర్‌ క సాపురం రవి, వీహెచపీ రాష్ట్ర సేవా ప్రముఖ్‌ రామ్మూర్తి, పట్టణ కార్య దర్శి రఘురాం, సహాయ కార్యదర్శి చెక్కాజగన తదితరులు పాల్గొన్నారు.

తాడిపత్రి స్థానిక శ్రీరామభక్త మండలి ఆధ్వర్యంలో హనుమాన విజయయాత్ర బైక్‌ ర్యాలీని పట్టణంలో గురువారం ఘనంగా నిర్వ హించారు. భక్తమండలి నిర్వాహకులు నిచ్చెనమెట్ల రాధాకృష్ణ, పోతుల గంగాధర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన భూమా నాగరాగిణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధిరెడ్డి శ్రీనివాసరెడ్డి, హిందూ ధర్మ ప్రచారకులు శంకరానందస్వామి, శ్రీరామ భక్తమండలి సభ్యులు నారాయణస్వామి తదితరులతోపాటు యువకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.