News

నంద్యాలలో పథ సంచలన కార్యక్రమం

287views

నంద్యాల జిల్లా పథ సంచలన కార్యక్రమం నంద్యాల ప్రజలు, అభిమానుల ఆహ్వానం, ఆనందోత్సాహాల పుష్ప వృష్టి మధ్య కాషాయ ధ్వజం ఘోష్ వాయిద్యాల లయబద్ద సంగీతంతో వైభవంగా జరిగింది.

తదుపరి కేశవరెడ్డి స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ ప్రాంగణంలో, జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన వేదిక నలంకరించిన ప్రధాన వక్త ప్రాంత కుటుంబ ప్రభోదన్ సంయోజక్ శ్రీ పుట్టా శేషు మాట్లాడతూ వేష భూషణాలతో ఎవరూ భారతీయుడు కాలేరు. భారత మాతను పూజించే వారే, గౌరవించే వారే భారతీయులు. మన దేశంలో ఉన్న ఇతర మతాలలోని వారు ఆయా దేశాలనుండి వచ్చిన వారు కాదు, వారి పూర్వీకులు మన మతం నుండి మారిన వారే. ఈరోజు చాలా మంది సంఘ్ వైపు చూస్తున్నారు. పరిశీలిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు.

కొంతమంది స్వార్థపరులు మాత్రమే తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు విదేశాల మద్దత్తుతో దేశ ద్రోహులను పెంచి పోషిస్తున్నారు. వారి కుట్రలను నిర్వీర్యం చేయటానికి సంఘ్ శాఖా కార్యక్రమాలను విస్తరించేందుకు మనమంతా సమయ మిచ్చి పనిచేయాలన్నారు.

సంఘ్ సనాతన ధర్మ పునరుజ్జీవనం కొరకు మాత్రమే ప్రారంభించ బడింది. ఏ మతానికీ వ్యతిరేకం కాదు, ఏ మతానికీ స్వంతం కాదు. దేశ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకం అని అందరినీ కలుపుకుని భారతమాతని పరమ వైభవ స్థానానికి ప్రస్థానం చేద్దాం. విశ్వ గురువైన అఖండ భారతమాత కల సాకరం చేసుకుందామని తెలిపారు.

సదరు కార్యక్రమంలో జ్యేష్ట కార్య కర్తలు, సంఘ్ స్వయం సేవకులు, సంఘ్ హితైషులు పాల్గొన్నారు.సంఘ్ ప్రార్థనతో కార్యక్రమం సంపన్న మైంది.