ArticlesNews

రామాయణానికి శాస్త్రీయత -2

116views

రామాయణానికి శాస్త్రీయత – 1

శ్రీరాముని చరిత్రను నిర్మించగలమా? దానికి ఆధారాలు చూపించగలమా? సరోజ్‌ ‌బాలా వేసుకున్న మొదటి ప్రశ్న ఇది. ఆ ప్రకారం కాలగణన, గ్రగేరియన్‌ ‌కేలండర్లు, నాటి ఆహారపు అలవాట్లు, పురావస్తువులు, నాటి జీవజాలం, భూమి దాని పరిభ్రమణం, నీరు దాని పెరుగుదల, ఆకాశం, వివిధ రుతువులలో అది కనిపించే విధానం, గ్రహాల కదలిక, మానవ పరిణామక్రమం, జంతు-వృక్ష సంపద, అడవులు వాటి వివరణ, మొదలైన ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ఎందరితోనో చర్చించారు. ప్లానిటోరియం సాఫ్ట్‌వేర్‌ను కూడా వాడారు.

మహర్షి వాల్మీకి రామాయణం (రామకథను) రామాయణ కాలంలోనే రాసి ఆ కావ్యాన్ని శ్రీరాముని బిడ్డలైన లవకుశులచే అయోధ్యలోనే పాడించాడు. ఆ గాన మాధుర్యానికి శ్రీరాముని కొలువు తన్మ యత్వంలో మునిగిపోయింది. తరువాత భారత దేశంతో పాటు ప్రపంచదేశాలలో వాల్మీకి రచనలతో ధీటైన రామాయణాలు సుమారు 3000 వరకూ వెలువడినాయి.

తాను ఫిజీ దేశానికి వెళ్లినప్పుడు ఎదురైన అనుభవం గురించి సరోజ్‌ ‌బాలా ప్రస్తావించారు. 300 ఏళ్ల క్రితం ఈస్ట్ ఇం‌డియా కంపెనీ భారతీయ కార్మికులను తీసుకువెళ్లింది. వారు తమతోపాటు ‘రామచరిత మానస్‌’ ‌తీసుకువెళ్లారు. ఇప్పటికి కష్ట సమయాలలో వారు చదువుకునే గ్రంథం అదే.

వివిధ భాషలలోను రామాయణాలు వచ్చాయి. 11వ శతాబ్దంలో తమిళంలో కంబకవి ‘రామావతరం’, 14వ శతాబ్దంలో మాధవకండలి అస్సామీ భాషలో ‘సప్తకాండ రామాయణం’’ రాశారు. 16వ శతాబ్దంలో సంత్‌ ఏకనాథ్‌ ‌మరాఠీ భాషలో ‘భవర్త రామాయణం’. అప్పుడే ముల్లా అబ్దుల్‌ ‌ఖాదిర్‌ ‌బదయూనీ వాల్మీకి రామాయణాన్ని పెర్షియన్‌ ‌భాషలోనికి అనువదించాడు. 17వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్‌ ‌రామచరిత మానస్‌ను అవధీ (హిందీ) భాషలో రాశాడు. 18వ శతాబ్దంలో గురు గోవింద్‌ ‌సింగ్‌, ‌గోవింద్‌ ‌రామాయణాన్ని గురుముఖి లిపిలో అందించాడు. 19వ శతాబ్దంలో రాధేశ్యామ్‌ ‌రాసిన రామాయణం నుంచే రామలీలా మైదానంలో జరిగే రామాయణ ఉత్సవానికి సంభాషణలు తీసుకుంటారు. ఇది ఉత్తర భారతం అంతటా ఉంది. 20వ శతాబ్దంలో తెలుగులో విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రాశారు. 21వ శతాబ్దంలో వీరప్ప మోయిలీ ‘శ్రీ రామాయణ మహా విశేషణం’ పేరుతో రామకథ రాశారు. వీళ్లందరి కధలకు స్ఫూర్తి వాల్మీకి రామాయణమే. సరోజ్‌ ‌బాలా మాత్రం గోరఖ్‌పూర్‌ ‌ప్రెస్‌ ‌ముద్రించిన ‘శ్రీమద్‌ ‌వాల్మీకి రామాయణం’ (సంస్కృతం-ఇంగ్లీషు అర్ధం) మూలాధారంగా తీసుకున్నారు.

వాల్మీకి శ్రీరామచంద్రుని స్పురద్రూపిగా, సద్గుణశీలిగా, మహావీరునిగా, దయార్థ్ర హృదయు నిగా, మానవజాతిలో మహోన్నతునిగా చిత్రించాడు. మంచి సోదరుడు, మంచి స్నేహితుడు, మంచి భర్త, వీటన్నిటికన్నా ఎక్కువగా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా చిత్రించాడు. సీతామాతను స్త్రీ జాతికే ఆదర్శ మహిళగా చిత్రించాడు. అన్నదమ్ములకు ఉదా హరణగా రామలక్ష్మణులను చెపుతారు. ఆంజనేయు నికి మించిన రామభక్తుడు లేడు. ఇలా అన్ని పాత్రలను ఈ మానవజాతి ఉన్నంత కాలం ఉండేటట్లు చిత్రించాడు వాల్మీకి.

సుమారు 2500 సంవత్సరాల క్రితమే గ్రామ గ్రామాన రామమందిరాల నిర్మాణం జరిగింది. పదవ శతాబ్దం నుండి శిల్పాలు చెక్కడం, కాన్వాస్‌లపై పెయింటింగ్‌లు వేయడం, 16వ శతాబ్దంలో ఆర్చ్‌లు కట్టడం ప్రారంభమైంది. 1652లో మేవార్‌ ‌సంస్థానంలో ‘‘సాహిబ్‌దిన్‌’’ అనే చిత్రకారుడు రామాయణ కథను అనేక కాన్వాస్‌లపై చిత్రించాడని బాలా రాశారు. అయోధ్యలో దొరికిన శాసనం గహద్వాల్‌ ‌రాజవంశీకుడు గోవిందాచార్య (1114-1154) విష్ణు హరి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుపుతున్నది.11వ శతాబ్దం నాటి నాగరీలిపి శాసనం ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో దొరికింది. దీనిని చందేల రాజవంశీకుడు కీర్తివర్మ 1060-1100 మధ్య వేయించాడు. రామజన్మ భూమి వివాదంలో ఇవి ఉడతా సాయం చేశాయి. శ్రీరామచంద్రుడు ఉత్తమ పురుషుడు. భారతీయ సిద్ధాంతం ప్రకారం మానవుడు మహా నీయుడైతే, దేవునిగా రూపాంతరం చెందుతాడు.

Indian concept transformation of man into God (Nar Se Narayan) and therefore, Dasarath Putra Ram is considered to be the embodiment of God Rama” (P.7)అని ప్రఖ్యాత చరిత్రకారిణి సుమిత్రా మహాజన్‌ ఈ ‌గ్రంథానికి రాసిన ముందుమాటలో వ్యాఖ్యానించారు.

సరోజ్‌ ‌బాలా తన గ్రంథాన్ని ఏడు అధ్యాయా లుగా విభజించారు. అయోధ్య న్యాయపోరాటంలో ఏ ఆధారం ఎలా సాక్ష్యం చెప్పిందో కూడా ఆమె వివరించారు. మొదటి అధ్యాయం లవకుశులు అయోధ్యలో రామకథను గానం చేయడం. దానిలో భాగంగా దశరథ మహారాజు నిర్వహించిన పుత్ర కామేష్ఠియజ్ఞం, ఆ సందర్భంలో ఆకాశంలోని గ్రహస్థితి, దశరధునికి నలుగురు కుమారులు జన్మించడం వర్ణించారు. అలహాబాద్‌ ‌హైకోర్టు ఆదేశాల ప్రకారం రామజన్మభూమి ఉండటం కొన్ని పురావస్తు ఆధారాలను కోర్టుకు సమర్పించడం, సమర్పించిన వాటిలో 7000 సంవత్సరాల నాటి రాగి బాణాలు, మట్టిపాత్రలు (టెర్రాకోట) బియ్యం, గోధుమలు, వంటపాత్రలు, అయోధ్య నుండి మిథి మార్గంలోని త్రవ్వకాలలో దొరికిన ఆధారాలు ఇచ్చారు. 2వ అధ్యాయంలో సీతారామలక్ష్మణుల అరణ్యవాసం, చిత్రకూట్‌ (‌నేటి హంపీ), ముందుగా శృంగవరపూర్‌ ‌గుహ నిషాదుని కోటకు చేరిన కథ. ఆ చిత్రాలను సాహెబ్‌దిన్‌ ‌వేశారు. ఇవి కోర్టుకు సమర్పించారు. 3వ అధ్యాయంలో దండకారణ్యం, రుషులు శరభంగ, సుతీక్షణ్‌ అగస్త్య మహామునుల దర్శనం, శూర్పణక ఉదంతం ఉంటాయి. ఇక్కడే కరదూషణుని సంహరించాడు శ్రీరాముడు. ఆరోజు సూర్యగ్రహణం. పంపాతీరాన శబరిని కలియడం, దండకారణ్యం నుండి సీతాపహరణ, దండకారణ్యంలోని వృక్ష- జంతు సంపద ఆధారంగా తీసుకున్నారు. 4వ అధ్యాయంలో వానరవీరులైన సుగ్రీవుని, హనుమను కలియడం, వాలి సంహరం. ఈ రోజు ఉదయం సూర్యగ్రహణం పట్టింది. సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం, రామలక్ష్మణులు పస్రవన్‌ ‌గుహలో (తుంగభద్రానది ఒడ్డున) జీవించడం, హంపీప్రాంతంలో రామయణానికి సంబంధించిన అనేక పురావస్తు ఆధారాలున్నాయి. కాబట్టి దీన్ని ప్రపంచవారసత్వసంపదగా •చీజు• ప్రకటించింది.

5వ అధ్యాయం సీతాన్వేషణ, హనుమ లంకకు ప్రయాణం, శ్రీలంక ప్రాంతంలో చందగ్రహణం ఉన్నాయి. సీతమ్మకు చూపడానికి ఉంగరం తీసుకువచ్చాడు హనుమ. ఆమె చూడామణిని ఇచ్చింది. ఇక్కడ 5000 సంవత్సరాల నాటి ఆధారాలుగా త్రవ్వకాలలో దొరికినా ఉంగరాలనూ, చూడామణులను కోర్టులో సమర్పించారు. 6వ అధ్యాయంలో శ్రీరామచంద్రుడు తన వానర సైన్యంతో కిష్కింధ నుండి రామేశ్వరానికి అక్కడ నుండి రామసేతు మీదగా లంకాపురానికి చేరారు. దీనికి 7000 సంవత్సరాలనాడు రామసేతు నిర్మాణంలో వాడిని ఇటుకలు, రాళ్లు, సున్నం ఆధారాలుగా చూపారు. రావణుని చంపి విభీషణునికి పట్టాభిషేకం జరిపించారు. ఇందుకు సంబంధించి 200 ఏండ్ల నాటి వర్ణచిత్రం ఆధారంగా చూపారు.

7వ అధ్యాయంలో శ్రీరామచంద్రుడు సీతమ్మతల్లి పదేళ్లు రాజ్యాన్ని ఏలారు. కానీ అపార్థాల కారణంగా గర్భవతిగా ఉన్న సీతామాతను తీసుకువెళ్లి అడవిలో వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపుతారు. అక్కడే లవకుశులు జన్మిస్తారు. ఉత్తర భారతదేశంలో 8 రాజ్యాలు ఏర్పడతాయి, వాటిని 8 మంది రాకుమారులు పరిపాలిస్తారు. దీనికి సంబంధించిన పురావస్తు ఆధారాలు దొరికాయి. వీటి ఆధారాలతో శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడనడానికి కావలసిన చారిత్రకాధారాలు విరివిగా దొరికాయి. కాబట్టి నవంబర్‌ 9, 2019‌లో ఇచ్చిన తీర్పు శ్రీరామచంద్రునికి అనుకూలంగా వచ్చింది. దాని పర్యవసానమే నేటి బాలరాముని మందిర నిర్మాణం.

“In India the core culture goes beyond time. It precedes the arrival of Islam, it precedes the arrival of Christianity. It is when we accept India in all its splendid glory that, with a shared past as a base, we can look forward to a shared future of peace and prosperity, of creation and abundance. Our past is there, with us forever. It has to be nurtured in good faith, not destroyed in exercises of political one-upmanship” Dr. A.P.J. Abdul Kalam, Ignited Minds, Chapter -5