ArticlesNews

అగ్ని సంజాత ద్రౌపదికి ఉన్న ఆలయాల గురించి తెలుసా ?

115views

దక్షిణ భారతంలో ద్రౌపదికి ఏడు ఆలయాలున్నాయనే సంగతి మీకు తెలుసా? కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ద్రౌపదికి ఒక్క ఆలయం కూడా లేకపోవడం చిత్రమైన సంగతే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. సింగపూర్, మలేషియా, శ్రీలంక, మారిషస్‌ వంటి ఇతర దేశాల్లోనూ ద్రౌపదికి ఆలయాలు ఉండటం. వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు మూలాపేటలో ద్రౌపదికి ఆలయం ఉంది. బెంగళూరు నాగరథపేటలో 800 ఏళ్ల పురాతన ధర్మరాయ పేరుతో గుడి ఉంది. ఇక్కడ పాండవులతో కొలువైన ద్రౌపది దర్శనమిస్తుంది. ఇక మిగిలిన అయిదు ఆలయాలు తమిళనాడులోనే ఉండటం విశేషం. చెన్నై వేలాచేరీలో ఈమె గ్రామ దేవతగా పూజలు అందుకుంటోంది. అలందూర్, మహాబలిపురం, కుంభకోణం, సైదాపేట వంటి ప్రాంతాల్లో ద్రౌపదిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పురాణాల ప్రకారం ఈమె అగ్ని సంజాత. పంచభూత రూపులైన పాండవులను నడిపించే అగ్ని శక్తికి ద్రౌపది సంకేతం. వ్యాస భగవానుడికి ఆమె పుట్టుకలో రహస్యం తెలుసు కనుకనే మరో అగ్ని సంజాతుడైన కర్ణుడిని కుంతీదేవి వద్ద పెరగనివ్వలేదు. కార్చిచ్చు సూత్ర న్యాయాన్ని అనుసరించి రెండు పరస్పర అగ్ని శక్తులు ఒకచోట ఉంటే ఆ రెండింటి శక్తి నశించి, అటు కర్ణుడికి, ఇటు ద్రౌపదికి కూడా ఖ్యాతి దక్కేది కాదు. ఆ సంగతి గ్రహించిన మహర్షి- కర్ణుడిని విడిచిపెట్టేలా భారత రచన చేశాడు. కనుకనే కర్ణుడు మహా దాతగా, ద్రౌపది భారతానికి సూత్రధారిగా కీర్తినార్జించారు.