News

హోలీ వేడుకలకు హాజరైన అమెరికా రాయబారి సెర్గియో గోర్

122views

ఢిల్లీలోని BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ ఆశ్రమంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ నాడు అక్షరధామ్ ఆలయాన్ని అమెరికా ప్రతినిధి బృందం సందర్శించింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ, అమెరికా స్పేస్ కమాండ్ జనరల్ స్టీఫెన్ వైటింగ్‌లతో కలిసి బుధవారం, మార్చి 4న న్యూఢిల్లీలోని BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.

స్వామినారాయణ్ అక్షరధామ్‌కు విశిష్ట నాయకులను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నానని గురూజీ మహంత్ స్వామి మహారాజ్ తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం, సాంస్కృతిక వారసత్వం, సామరస్యం, శాంతి ఉమ్మడి విలువలకు ప్రతిబింబం అన్నారు. అందరికీ ఆనందకరమైన, ఉత్సాహభరితమైన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి ప్రతినిధులు సందర్శించడం స్నేహం, పరస్పర గౌరవం, బంధాలను బలోపేతం చేస్తూనే ఉండాలని కోరుకున్నారు. కాగా, హోలీకి ఇది సరైన మొదటి గమ్యస్థానం అని, ఈ అసాధారణ ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, శాశ్వత విలువలను ప్రదర్శిస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అక్షరధామ్‌ బృందానికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.