
127views
లండన్ లో ముస్లింలు రెచ్చిపోయారు. హోళీ పర్వదినం సందర్భంగా లండన్ లోని హోరో సివిక్ సెంటర్ పార్కింగ్ దగ్గర హిందువులు హోళీ ఆడుతుండగా అడ్డుకొని, గలాటా సృష్టించారు. స్థానికంగా దగ్గర్లో వుండే మసీదు నుంచే ఈ గుంపు వచ్చినట్లు హిందువులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలుడ్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
స్థానిక హిందూ కుటుంబాలు అంతర్జాతీయ సిద్ధాశ్రమ శక్తి కేంద్రం నిర్వాహకులు అప్పటికే స్థానిక కౌన్సిల్ నుంచి హోలిక దహన వేడుకలకు అనుమతులు కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మేయర్లతో సహా అనేక మంది నాయకులు, లండన్ అగ్నిమాపక దళ కమాండర్లు తదితరులు అందరూ పాల్గొన్నారు.
ఇదే సమయంలో హోళీ జరుపుకుంటున్న సమయంలో నిందితులు గందరగోళానికి తెర తీశారు. ఒకరినొకరు తోసుకోవడం, కొట్టుకోవడం కూడా జరిగింది. ఇందులో 14 ఏళ్ల బాలుడు కూడా వున్నాడు. దీంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో గొడవలు ప్రారంభమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.
మరో వైపు దీనిపై హిందువులు స్పందించారు. ‘‘తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. దీని తర్వాతే హోళీ ఆడుతున్నాం. ఈ సమయంలోనే కొందరు వ్యక్తులు వచ్చి, తమపై చెత్త డబ్బాలు విసిరారు. దుర్భాషలాడారు. నానా రభస చేశారు .దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులను చూసి
దుండగులు పారిపోయారు.’’ అని పేర్కొన్నారు.
గతంలోనూ హిందువులపై ఇలాంటి దాష్టీకాలు…
యూకేలో హిందువులే లక్ష్యంగా ఇస్లాం ఛాందసులు రెచ్చిపోవడం కొంత కాలంగా జరుగుతోంది. 2022 సెప్టెంబర్ మాసంలో కూడా హిందువులపై దాడి జరిగింది. లీసెస్టర్‌లో ముస్లిం మూకలు వారి మతపరమైన చిహ్నాలను ఉపయోగించి హింసకు దిగారు. భారతదేశం-పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ తర్వాత తమ సమాజంపై ఇలాంటి హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా హిందువులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.ఇదే సమయంలో ఇస్లాం ఛాందసులు హిందువుల ఇళ్లే టార్గెట్ గా దాడులకు దిగారు. దీంతో హిందువులు తమని తాము రక్షించుకునే క్రమంలో వుండగా.. దానిని కూడా హింస అంటూ ఛాందసులు పుకార్లు రేపారు.





