807
మహాశివరాత్రి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రకాశం జిల్లా దోర్నాలలో సేవాభారతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ సౌకర్యం ఉపయోగించుకున్నారు. మెడికల్ క్యాంప్ ను ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యామ్ కుమార్ ప్రారంభించగా, ఆరెస్సెస్ ప్రకాశం విభాగ్ ప్రచారక్ శ్రీ చంద్ర శేఖర్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్ లో DR. బాలాజీ (MBBS), Dr. లావణ్య (MBBS) తమ సేవలు అందించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సేవాభారతి మార్కాపురం శాఖ నిర్వాహకులు పేర్కొన్నారు.