News

ఆలయ శిథిలాల కింద బయటపడ్డ పురాతనదేవీ మందిరం

162views
ఒడిశా  భువనేశ్వర్‌లోని ప్రసిద్ధ శుకసారి మందిరం శిథిలాల కింద అత్యంత అరుదైన, పురాతనమైన దేవీ మందిరం బయల్పడింది. లింగరాజ్ ఆలయం సమీపంలోని బిందుసాగర్ చెరువు వద్ద, భారత పురాతత్వ శాఖ (ASI) తవ్వకాలలో ఈ 13వ శతాబ్దపు కళింగ శైలి దేవీ మందిరం వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన ఆలయం ఖఖరా శైలికి చెందినదని పరిశోధకులు తెలిపారు. ఈ అరుదైన దుర్గాదేవి ఆలయం లింగరాజ్ ఆలయ ఉత్తర ద్వారం, మిందుసాగర్ చెరువు సమీపంలోని శుకసారి మందిరం కింద ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఆలయం ఖఖర శైలి అంటే శైవ, శాక్త సాంప్రదాయల మిశ్రమాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఒడిశాలో 23 ప్రసిద్ద పురాతత్వ సంరక్షిత ఆలయాలున్నాయి. అందులో 15 ఆలయాలు ఈ ఖఖర శైలిలో ఉన్నాయి. శుకసారి దేవాలయం తో పాటుగా దాని పక్కనే ఉన్న సారీ దేవుళ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశం, కళింగ శైలి వాస్తుశిల్పానికి, ముఖ్యంగా 13వ శతాబ్దపు రాజు నరసింహ దేవ్ I కాలం నాటి కళాఖండాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ చారిత్రక సంపదను, శైవ-శాక్త సమ్మేళనాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది అని పరిశోధకులు భావిస్తున్నారు. .