
131views
రాజస్థాన్‌లోని ఝంఝను ప్రాంతంలో త్యోందా గ్రామ సమీపంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మధ్యయుగం నాటి ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ లక్ష్మీ, గణేశుడి విగ్రహ భాగాలు కూడా లభ్యమయ్యాయి. ఇవి 11-12వ శతాబ్దాలకు చెందినవిగా పురావస్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆలయం రాజ్‌పూత్ కాలానికి లేదా అంతకంటే ముందు యుగానికి చెందినదిగా తెలుస్తోంది. ఈ ఆనవాళ్లు మధ్యయుగంలో చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఈ తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కనుగొన్న ప్రతి పురాతన వస్తువులను జాగ్రత్తగా నమోదు చేస్తూ, ఫొటోగ్రఫీ, సంరక్షణ చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రీయ విశ్లేషణ, కచ్చితమైన కాల నిర్ధరాణ పూర్తయిన తర్వాత ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యం మరింత స్పష్టంగా తెలుస్తుందన్నారు.





