News

హిందూ సమాజం చైతన్యం దిశగా ‘‘హిందూ సమ్మేళనాలు’

164views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపితమై 100 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా సమాజంలో మరింత చైతన్యం తీసుకురావడానికి సంఘ్ కొన్ని కార్యక్రమాలను రూపొందించింది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి జనజాగరణ చేయడం, ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులతో పాటు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర సంఘచాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాలతో పాటు హిందూ సమ్మేళనాలను కూడా నిర్వహిస్తోంది సంఘ్.
దేశ వ్యాప్తంగా ఈ హిందూ సమ్మేళనాలకి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సాధు సంతులు, సమాజంలోని ప్రతిష్ఠిత వ్యక్తులు, అన్ని రంగాల వారూ ఈ హిందూ సమ్మేళనాలకి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని ప్రాంతాలలో సంప్రదాయ పూజలు, గోపూజలు.. ఇలా స్థానికంగా కార్యకర్తలు యోజన చేసిన విధంగా జరుగుతున్నాయి.
మన తెలంగాణలో కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మార్చి 20 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ హిందూ సమ్మేళనాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణ అంతటా కూడా ఈ సమ్మేళనాలు జరగనున్నాయి. ఇందులో స్థానిక ప్రజలు, పుర ప్రముఖులు, అన్ని రంగాలకు చెందిన వారు, అలాగే సాధు సంతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
sammelan23
అయితే.. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే హిందూ సమ్మేళనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. యూపీలోని బల్లియాలోని చితౌనిలో సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన హిందూ సమ్మేళనానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. భారతమాత చిత్రపటానికి పుష్పార్చన చేసి, కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమ్మేళనాన్ని ముఖ్య వక్త, ఆర్‌ఎస్‌ఎస్ అఖిల్ భారతీయ పర్యావరణ సంయోజక్ గోపాల్ ఆర్య హాజరయ్యారు. మహామండలేశ్వర్ కౌశలేంద్ర గిరి జీ మహారాజ్, కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గోపాల్ ఆర్య మాట్లాడుతూ.. భారత్ తాత్విక దృక్పథంతోనే ప్రపంచ సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. వసుధైవ కుటుంబం అన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇక.. మహామండలేశ్వర్ కౌశలేంద్ర గిరి జీ మహారాజ్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అంటరానితనం మరియు కుల ఆధారిత వివక్షను తొలగించడం ద్వారానే హిందూ సమాజం ఉద్ధరణ సాధ్యమవుతుందన్నారు. భారత దేశ సంస్కృతి అందర్నీ సమానంగా ఆదరిస్తుందని, వసుధైక కుటుంబం అన్న ధ్యేయవాక్కుతో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందన్నారు.
================
ఒడిశాలోని కేంద్రపార జిల్లాలోని నీలకంఠ ఆదికుండి ప్రాంతంలో చెమెదాస్ మాతా మైదానంలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. హిందూ మతం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం పట్ల సమిష్టి బాధ్యతను నొక్కి చెబుతూ “ఐక్యత కోసం సంకల్పం” అనే పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహంత్ రామకృష్ణ దాస్ మహారాజ్, రాధావల్లభఖ మఠ్ పూరీతో పాటు మరికొంత మంది స్వామీజీలు హాజరయ్యారు. హిందూ ధర్మం మరియు భారత మాత రక్షణ కోసం సమాజం ఐక్యంగా మరియు సమిష్టిగా పనిచేయాలని స్వామీజీలు పిలుపునిచ్చారు. జగన్నాథ సంస్కృతి ప్రచారం మరియు రక్షణకు వారు చేసిన కృషికి గుర్తింపుగా శ్రీ జగన్నాథ సంస్కృతి ప్రచార సంస్థాన్ ఈ అవార్డులను ప్రదానం చేసింది.
sammelan
ఈ సందర్భంగా వక్తలందరూ మన ధర్మం, ధర్మం ఎంత గొప్పదో వివరించారు. అక్రమ మత మార్పిళ్ల విషయంలో అత్యంత జాగరూకతతో వుండాలని సూచించారు. దేశ భక్తిని ప్రతి ఒక్కరూ మరింత పెంపొందించుకోవాలని ,దీని ద్వారా సమాజానికి సేవ చేయాలని సూచించారు.
======================
ఉత్తరాఖండ్ లోని శ్రీ గంగా హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హర్కీ పౌరీలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహామండలేశ్వర్ స్వామి హరిచేత్నానంద గిరి మహారాజ్ తో పాటు పలువురు స్వామీజీలు హాజరయ్యారు .ఈ సందర్భంగా యావత్ హిందూ సమాజం ఐక్యంగా వుండాలని వారంతా పిలుపునిచ్చారు. ఇప్పుడు మేల్కొనకపోతే.. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచించారు. కులం, వర్గం ఆధారంగా హిందువులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై హిందువులు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు.
ఇక.. ఈ కార్యక్రమానికి ప్రాంత ప్రచారక్ డాక్టర్ శైలేంద్ర కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా రాష్ట్రంలో హిందూ సమ్మేళనాలు జరుపుతున్నామని అన్నారు. ఈ సమ్మేళనాల ద్వారా యావత్ హిందువులను ఏకం చేయడం, సంప్రదాయాలను పునరుద్ధరించడం ముఖ్య ఉద్దేశమన్నారు.ప్రపంచవ్యాప్తంగా హిందూ మతంపై దాడి జరుగుతోందని, హిందువులు ఎక్కడైతే తక్కువ సంఖ్యలో వుంటారో అక్కడ ఇబ్బందులు పడుతున్నారన్నారు.
======================
సౌత్ ఢిల్లీలోని ఛతర్ పూర్ లో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఇందులో దాదాపు 1000 కి పైగా హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతి కార్యక్రమాలతో పాటు గోపూజ, హవనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమావేశానికి బిజయ్ ఆనంద్ అధ్యక్షత వహించారు. హిందూ సమాజంలోని సామాజిక, కుల ఆధారిత అసమానతలను తొలగించాల్సిన అవసరం వుందన్నారు. సామాజిక సమరసతను, ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం వుందన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని పురోహిత్ శిక్షణ విభాగాధిపతి ప్రొఫెసర్ రామరాజ్ ఉపాధ్యాయ్ తో పాటు పలువురు ప్రొఫెసర్లు దీనికి అతిథులుగా హాజరయ్యారు. సనాతన సంస్కృతిని మరింత బలోపేతం చేసుకోవాలని, హిందూ ధర్మాన్ని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
sammelan2
ఇక.. చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారికి బహుమతుల ప్రదానం కూడా జరిగింది. ఆక్స్‌ఫర్డ్ స్కూల్ మరియు బృందా స్కూల్ విద్యార్థులు యోగా ఆధారిత నృత్యం మరియు సమూహ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కుశాల్ చౌదరి సంస్కృత శ్లోకాలను పఠించారు, రాధారమేష్ దేశభక్తి గీతాన్ని పాడారు మరియు చైతన్య స్ఫూర్తిదాయకమైన పాటను పాడారు.
========================
యూపీలోని ముజఫర్ నగర్ లోని కులరసి గ్రామంలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఇందులో మహిళలు, పురుషులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. షామ్లీలోని ఆర్తి ఆశ్రమానికి చెందిన లలితానంద మహారాజ్ మరియు మీరట్ నుండి అల్కా సంబంధ్ ప్రచారిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హవనం, గణపతి పూజ, సరస్వతీ మాత వందనంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
సాధు సంతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై, ప్రజలకు మార్గనిర్దేశనం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వామి లలితానంద మహారాజ్ భారత దేశ గొప్పదనాన్ని వివరించారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాలను గుర్తు చేశారు. అలాగే భారత దేశ సాంస్కృతిక వైభవాన్ని వివరించారు. హిందువులు అంతా ఐక్యంగా వుండాలని పిలుపునిచ్చారు.
sammelan234
=================
నోయిడా ప్రాంతంలో దాదాపు 100 స్థానాల్లో ఈ విరాట్ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ నెల ఒకటో తారీఖున దాదాపు 11 స్థానాల్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. హిందువులు భారీ సంఖ్యలో, అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక.. సెక్టార్ 122 లో కూడా హిందూ సమ్మేళనం జరిగింది. గురూజీ గౌతమ్ రిషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నోయిడా విభాగ్ ప్రచారక్ చిరంజీవి కుమార్ వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 100 ఏళ్ల ఆరెస్సెస్ ప్రస్థానాన్ని ప్రజల ముందు వుంచారు. ఇక.. మహంత్ ప్రేమ పూరీ మహారాజ్ కూడా ఆశీ పూర్వక ప్రసంగాన్ని అందించారు., హిందువులంతా ఐక్యంగా వుండాలని, ధర్మాన్ని ఆచరిస్తూ, కాపాడాలని పిలుపునిచ్చారు.
ఇక.. సెక్టార్ 47 లో కూడా హిందూ సమ్మేళనం జరిగింది. మహానగర్ సంఘ చాలక్ దినేష్ గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచ పరివర్తన్ గురించి ప్రస్తావించారు. స్వామి ఆనందేశ్వర గిరి మహారాజ్ స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందూ ధర్మం విరాట్ సంస్కృతిని వివరించారు. అలాగే సర్ఫాబాద్, సలార్ పూర్ లో కూడా హిందూ సమ్మేళనాలు జరిగాయి.