News

ఢిల్లీలో.. ఘర్ వాపసీ సమ్మేళన్

129views

సనాతన ధర్మం నుండి వేరైన మనవారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చే దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వధర్మానికి వారిని తీసుకువచ్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి,వాటిని ఏవిధంగా పరిష్కరించాలి అనే విషయాలను చర్చిస్తూ ఈ నెల 8వ (ఫిబ్రవరి 8)తేదీన న్యూఢిల్లీలో ‘ఘర్ వాపసీ సమ్మేళన్’ అనే కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి 25 కి పైగా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు , స్వధర్మాచరణలో నిమగ్నమైన కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఘర్ వాపసీ చేస్తున్నప్పుడు వచ్చే వివిధ సామాజిక, చట్టపరమైన, ఆర్థిక, రాజకీయ సమస్యలపై వివరంగా చర్చించారు. అదే సమయంలో, ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి నిర్దిష్ట ఆచరణాత్మక చర్యలు కూడా చర్చించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఘర్ వాపసీ చేస్తున్న సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయం, కమ్యూనికేషన్ సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రత్యేక డిజిటల్ platform-www.sanatansamvaad.com అధికారికంగా ఆవిష్కరణ జరిగింది.

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, జాతీయ భద్రత సనాతన సంప్రదాయాల పరిరక్షణ కోసం, ఘర్ వాపసీ అభియాన్ ను దేశవ్యాప్తంగా నిర్వహించాలని, సమాజంలో అవగాహన పెంచడానికి సమిష్టితో కూడిన నిరంతర ప్రయత్నాలు జరుగుతాయని సదస్సులో తీర్మానించారు. ఈ కార్యక్రమాన్ని హిందూ జనజాగృతి సమితి, సనాతన్ ఘర్వాపసా ఫౌండేషన్ , సనాతన సంవాద్ సంయుక్తంగా నిర్వహించాయి.