News

మాలేగావ్‌లో టిప్పు సుల్తాన్‌ ఫొటో

94views

మాలేగావ్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కొత్తగా ఎన్నికైన డిప్యూటీ మేయర్‌ కార్యాలయంలో పెట్టిన టిప్పు సుల్తాన్‌ ఫొటో వివాదాన్ని రాజేసింది. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పాటు హిందుత్వ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నర్సీన్‌ బానో మేయర్‌గా, షా న్‌-ఎ-హింద్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టాక షాన్‌ టిప్పు సుల్తాన్‌ చిత్రాన్ని డిప్యూటీ మేయర్‌ తన కార్యాలయంలో అమర్చారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటో వైరల్‌ కావడంతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

సంఘటనపై షిండే శివసేన, హిందుత్వ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక జాబితాలోని గొప్ప వ్యక్తుల ఫొటోలను మాత్రమే ప్రదర్శించాలనే నియమం ఉందని పేరొంటూ మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర జాదవ్‌కు వినతి పత్రం సమర్పించాయి. కాగా, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ లాగానే టిప్పు సుల్తాన్‌ కూడా గొప్ప వాడని, ఆయనను కూడా గౌరవించాలని కాంగ్రెస్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌ సపాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్రంగా స్పందిస్తూ టిప్పు సుల్తాన్‌ లాంటి హంతకుడిని ఛత్రపతి శివాజీ మహరాజ్‌తో పోల్చడం సిగ్గుచేటని విమర్శించారు.