
మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని ఉమర్ ఖేడ్ లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వార్షికోత్సవంలో వేసిన పాటపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠశాల వార్షికోత్సవంలో పాకిస్తాన్ యుద్ధ కాలం నాటి పాట “ఏ మర్ద్-ఎ-ముజాహిద్ తేరి యల్గార్ కహాన్ హై”అన్న పాటను ప్లే చేశారు. ఈ సమయంలో పిల్లలు కత్తులతో ప్రదర్శన కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సమయంలో విద్యార్థుల హావభావాలు అత్యంత దూకుడుగా వున్నాయని అర్థమైపోతోంది.
ఈ వీడియోపై జాతీయవాదులు, బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. పాఠశాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. ఆ పాటలో ‘‘యల్ గార్’’ అనే పదం వుంది. ఈ పదం ఆకస్మిక సైనిక దాడి లేదా, యుద్ధ సన్నద్ధతను సూచిస్తుందని జాతీయవాదులు పేర్కొంటున్నారు.
అయితే.. అచ్చు ఇలాంటి ఘటనే 2023 లోనూ ఓ పాఠశాలలో జరిగింది. ఇదే పాటను విద్యార్థులు ప్రదర్శించారని పేర్కొంటున్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని, జాతీయ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదు దారులు పేర్కొంటున్నారు.
ఫిర్యాదుదారుల ప్రకారం పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులు “ఏ మర్ద్-ఎ-ముజాహిద్ తేరి లలకర్ క్యా హై” పాటను ప్లే చేశారని, విద్యార్థులు నృత్యాలు కూడా చేశారని పేర్కొన్నారు. పాక్ లో సైనికులకు అత్యంత ప్రేరణాదాయక పాట అని, దీనిని ఇక్కడ ఎందుకు ప్లే చేశారని ప్రశ్నించారు.





