News

డల్లాస్, పాకిస్తాన్‌లా మారింది.. అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ నేత ఆందోళన

135views

అమెరికాలో పెరుగుతున్న ముస్లిం వలసలపై రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌లోని కొన్ని ప్రాంతాలు వేగంగా ‘‘ఇస్లామీకరణ’’కు గురవుతున్నాయని అన్నారు. టెక్సాస్‌లోని కొన్ని మాల్స్ వెళ్తే, మనం డల్లాస్‌లో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అని అనిపిస్తోందని చెప్పారు. సామూహిక ఇస్లామిక్ వలసలు మనం ఎంతగానో ప్రేమించే అమెరికాను చంపుతున్నాయని అన్నారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సందేశంలో, డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

డల్లాస్ వ్యాప్తంగా మసీదులు పెరుగుతున్నాయని, ఎపిక్ సిటీ కంపౌడ్స్ వంటి పెద్ద ఇస్లామిక్ కమ్యూనిటీలు ఏర్పడుతున్నాయని, ఇవి మన అమెరికన్ సంస్కృతిని మార్చేస్తోందని ఆయన అన్నారు.

గతంలో కూడా బ్రాండమ్ గిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇస్లాం అమెరికాను నాశనం చేయడానకి వచ్చిందని అన్నారు. సామూహిక వలసలు అమెరికాను నాశనం చేస్తాయని అన్నారు.