News

నిర్మాణంలో ఉన్న గుడిని కూల్చిన పోలీసులు

489views

రాష్ట్రంలో హిందువులని బ్రతకనిస్తారా? లేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న హిందువులు.

మార్కాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హరిజనులు, ముఠా పని వారు రూపాయి రూపాయి కూడబెట్టుకుని రామాలయ నిర్మాణాన్ని మొదలుబెట్టారు. ఐతే నిర్మాణంలో ఉన్న గుడి పోలీస్ స్టేషన్ కి అడ్డంగా వున్నదని 8/2/2020 శనివారం రోజు పోలీసువారు దానిని నిర్ధాక్షణ్యంగా కూల్చేశారు. ఎంత అమానుషం? ఎంత దారుణం? అని స్థానిక హరిజనులు వాపోతున్నారు.  ఈ గుడి సుమారు 30 సంవత్సరాల నాటికి పూర్వం నుండే ఉన్నదని, ఈ మధ్య నిర్మించిన పోలీస్ స్టేషన్ కు అడ్డమని గుడిని కూల్చెయ్యడం సమంజసం కాదని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎట్టి పరిస్థితులలోనూ దేవాలయ పునర్నిర్మాణం జరగాలని, ఎవరు కూల్చారో వారే తిరిగి కట్టించాలని, దీని కోసం ఎంత దూరమైనా  వెళ్లడానికి  సిద్ధంగా ఉన్నామని హిందూ సంఘాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో హిందువులకు, దేవాలయాలకు ఎటువంటి రక్షణ లేదని, ఆంధ్రప్రదేశ్ లో హిందువులు జీవించలేని పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా  హిందువులంతా ధర్మ పరిరక్షణకు ముందుకు రావాలని యావత్ హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.