
705views
ముంబయికి చెందిన ఏడవ తరగతి విద్యార్థిని కామ్య కార్తికేయన్ అరుదైన గుర్తింపును స్వంతం చేసుకుంది. ఇక్కడి నేవీ చిల్డ్రస్స్ స్కూల్లో చదువుతున్న కార్తికేయన్, దక్షిణ అమెరికాలో శిఖరమైన మౌంట్ అకాన్‌కాగువాను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు స్థాపించింది. 6962 మీటర్ల ఎత్తైన అకాన్‌కాగువాను కామ్య ఫిబ్రవరి 1న అధిరోహించింది. ఆ శిఖరాన్ని అధిరోహించిన అనంతరం దానిపై ఆమె త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శిక్షణ అనంతరం ఆమె ఈ ఘనతను సాధించిందని నేవీ అధికారులు ఒక ప్రకటనలో వివరించారు. కాగా ఈ అరుదైన ఘనత సాధించేందుకు తను ఎన్నో ఆటంకాలను, అత్యంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందని కామ్య తెలిపింది. కాగా కామ్య ఇప్పటికే ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియాలోని పలు శిఖరాలను అధిరోహించింది.





