NewsProgramms

సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక

98views

సామాజిక సమరసతా వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో స్థానిక సంతపేటలో సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ మరియూ సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జనార్ధన్, సామాజిక సమరసతావేదిక విశాఖపట్నం జిల్లా కన్వీనర్, శ్రీ రాగాల నర్సింగరావు, సమరసతా సేవా ఫౌండేషన్ మండల ప్రముఖ్ శ్రీ రాజారావులు పాల్గొన్నారు.

సంత్ రవిదాస్ జీవిత చరిత్ర ను నర్సింగరావు గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన సంత్ రవిదాసు భక్తి యుగంలో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడని కొనియాడారు. చెప్పులు కుట్టి జీవించే చమార్  కులము నందు జన్మించిన రవి దాసు ప్రముఖ విష్ణు భక్తుడు రామానందుని అనుయాయిలలో ఒకరని తెలిపారు.

సాక్షాత్తు శ్రీకృష్ణుడే సాధు రూపంలో రవిదాసు ఇంటికి వచ్చి, సామాన్య లోహాలను బంగారంగా మార్చగలిగే పరుసవేదిని ఇవ్వబోగా, దానితో తనకు అవసరం లేదని తిరస్కరించిన నిష్కామ కర్మ యోగి రవి దాస్ అని ఆయన పేర్కొన్నారు.

సంత్ రవిదాస్ చెప్పులు కుట్టే వృత్తిని కొనసాగిస్తూనే తన అసాధారణ కృష్ణ భక్తిని తన రచనలలో సహజ సుందరంగా, స్వచ్ఛంగా ప్రకటించాడని ఆయన తెలిపారు. ఎంత దుర్మార్గుడైనా సత్సంగ ప్రభావంతో 18 అవుతాడని, తాను కూడా సత్సంగ ప్రభావం వల్లనే సమాజంలో ఉన్నత స్థితికి మెదక గలిగానని, తన పేరు ప్రతిష్టలు అన్నిటికీ ఆ సద్గురుని సాంగత్యం, ఆ పరమేశ్వరుని పట్ల గల నిశ్చల భక్తి ప్రపత్తులే కారణమని రవిదాసు వినయంగా, స్పష్టంగా ప్రకటించాడని శ్రీ నరసింగరావు తెలియజేశారు.

శ్రీమతి బూర ఆదిలక్ష్మి బృందం, శ్రీ గాదం సూరిబాబు బృందం, శ్రీ రవ్వ అప్పలనరసయ్య వాయిద్య సహకారంతో సంత్ రవిదాస్ కీర్తనలను ఆలపించారు.

ఈ ఉత్సవాన్ని శ్రీ గాదం హరిశంకర్ ప్రముఖ  గేయ రచయిత ఐనాడ దుర్గాప్రసాద్ లు కొందరు దాతల సహకారంతో నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.