
76views
గోవుల మూత్రం నుంచి పర్యావరణ హిత సిరా (ఇంకు)ను తయారు చేశారు దిల్లీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు శుచి వర్మ నేతృత్వంలో దీనిని తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు వారు ‘గౌరంగ్’ అనే పేరు పెట్టారు. గోవుల మూత్రం నుంచి వారు నీలి వర్ణ పదార్థాన్ని సేకరించారు. ఇది ద్రవ, ఘన రూపంలో వచ్చింది. దీనికి స్వల్పంగా ఉప్పును కలిపి ఇంకును తయారు చేశారు.





