ArticlesNews

వాతావరణంపై భారతీయ ప్రాచీన విజ్ఞానం

96views

ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే ఉపద్రవాల గురించి రకరకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే , ఈ వాతావరణానికి సంబంధించి మన ప్రాచీన భారతంలో ఎలా వివరించారో , ఇంకా మన భారతీయ ఋషులు దీనిగురించి ఏమేమి చెప్పారో, ఈ వ్యాసంలో చూద్దాం.

మనం రోజూ జపించే గాయత్రి మంత్రమైన “ఓం భూర్ భువస్వాహా తత్ సవితుర్ వరేణ్యం” అనగా సూర్యరశ్మి, మన భూమి అంతటా వ్యాపించి ఉంది అని అర్ధం. ఈ గాయత్రి మంత్రం, మన ఋగ్వేదంలో వ్రాయబడింది. మనం నిత్యం పూజించే సూర్య భగవానుడి చిత్రపటంలో సూర్యుడు రధం మీద వస్తున్నట్లు, ఆ రథానికి ఏడూ అశ్వాలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. అయితే మనం ఈ ఏడు అశ్వాలను , ఏడు రంగులకు ప్రతీకగా భావించవచ్చు. మనకు సూర్యుని నుండి భూమిని చేరే విద్యుదయస్కాంత వికిరణాలల్లో , ఎక్కువ చేరె కిరణాలు మానవ కంటికి కనిపించే తరంగదైర్ఘ్యంతో ఉంటాయి. ఈ ఏడు కిరణాల తరంగదైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) , మనం చూడగలిగే ఏడు రంగులుగా చెప్పుకోవచ్చు.

అలాగే రామాయణంలో ఈ శ్లోకం చూస్తే , మన ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోని నీరు ఆవిరయ్యే ప్రక్రియ, తద్వారా భాష్ప౦ చెందిన నీరు , వర్షం రూపంలో భూమి చేరటం అర్ధమవుతుంది.

నవమాసద్రతాన్ గర్భాన్ భాస్కరస్య గభస్తిభిహి !
పీత్వ రసాన్ సముద్రనాన్ ద్యాహ్ ప్రస్తుతే రసాయనం !!

ఈ శ్లోకం ద్వారా , శ్రీరాముడు వర్షాకాలాన్ని లక్ష్మణుడికి వివరించడం రామాయణంలో ఉంది.

అదే విధంగా , రామాయణంలోనే ఉన్న ఈ శ్లోకాన్ని చూస్తే, మన ఇప్పట్లో చదువుకొనే ఉష్ణ ప్రసరణ, వర్షాలకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకోవచ్చు.

ఈసా ఘర్మపరిక్లిష్ఠ నవవారిపరిప్లుతా !
సితేవ శోకసంతప్త మహి బాష్పన్ విమున్కటి!!

దీని అర్ధం , ఉష్ణం ద్వారా బాగా వేడెక్కిన ఈ భూమి, స్వచ్ఛమైన నీటిని వర్షం ద్వారా ఇస్తుందని వచ్చేట్టుగా ఉంటుంది.

పై విషయాలను నిశితంగా చూస్తే, మన వేదకాలంనాటి భారతీయ విజ్ఞానం ఎంత లోతుగా ఉండేదో అర్ధమవుతుంది. వరాహమిహిరుడు వ్రాసిన చరక సంహితలో కూడా సూర్యుడు , భూమి మిగిలిన గ్రహాల గురించిన విషయాల ప్రస్తావన ఉంది. భూమి మీద పడే వర్షాలకు, ఇంకా గ్రహాల కదలికలకు సంబంధం ఉన్నట్లుగా ఉంది.

అయితే, పైన పేర్కొన్న విషయాలను, మనం ఆధునిక విజ్ఞానంను అనుసరించి రుజువు చేసే ఆవశ్యకత ఉంది. ఆ దిశలో మన పరిశోధనలు చెయ్యాల్సిన అవసరమూ ఉంది. అప్పుడే మన ప్రాచీన భారత వైభవాన్ని ప్రపంచానికి చాటగలం.