News

గోవులను తరలిస్తున్న వాహనం సీజ్

130views

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ పరిధిలో సీజ్‌ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27 గోవులను ఒక లారీలో తరలిస్తుండగా చట్టబద్దమైన పత్రాలు లేకపోవడంతో సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గోవులను సురక్షిత సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.