
అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్ర, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు ఆచార్య వెంపటి కుటుంబశాస్త్రికి భారత ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ పురస్కారం ప్రకటించటం హర్షణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం తెలిపారు. మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ టేకుపల్లికి చెందిన కుటుంబశాస్త్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం తమకు గర్వకారణం అన్నారు.
న్యూఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, గుజరాత్ శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వ విద్యాలయాలకు ఉప కులపతిగా పనిచేశారని తెలిపారు. భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పీఠములో తొలి ఆచార్యులుగా పనిచేశారని తెలిపారు. ఆయన ఇప్పటివరకు దేశంలో మరెన్నో అత్యున్నత పురస్కారాలు, అవార్డులు అందుకున్నారని తెలిపారు.




