News

“ముంబ్రాను ఆకుపచ్చగా మారుస్తాం”.. ఎంఐఎం కార్పొరేటర్..

150views

ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాల్లో  ఎంఐఎం గెలిచింది.

ఈ గెలుపు తర్వాత  ఎంఐఎం కార్పొరేటర్ సహర్ యూనస్ షేక్ వివాదాస్పదలు చేశారు. ‘‘ముంబ్రాను ఆకుపచ్చగా మార్చాలి’’ అనే అహంకార  వ్యాఖ్యలు  చేసారు. ఈఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ముంబ్రా పోలీస్ స్టేషన్‌లో ఆమె లిఖితపూర్వకంగా క్షమాపణ పత్రాన్ని సమర్పించారు. తాను త్రివర్ణ పతాకానికి విధేయత చూపుతానని చెప్పింది. నేపథ్యంలో ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు.

ఆమె చేసిన వ్యాఖ్యలపై రెండు సార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ షిండే చెప్పారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణ చెప్పిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఆమె క్షమాపణల్ని అంగీకరించినప్పటికీ, మళ్లీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబ్రా పోలీసులకు చేసిన భావోద్వేగ ప్రకటనలో..‘నేను మన త్రివర్ణ పతాకం కోసమే జీవిస్తాను, మరణిస్తాను’’ అని దేశ జాతీయ గుర్తింపును తాను ఎప్పటికీ అగౌరవపరచనని చెప్పింది.

ఈ వ్యాఖ్యలపై    బీజేపీ నేత కిరిట్ సోమస్య  స్పందిస్తు  . ఆమె వయసు 22 ఏళ్లే అని, ఈ సంఘటనను నిశితమైన రాజకీయ వ్యూహంలో భాగమని అభివర్ణించారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందని, ఇది ఓట్ జిహాద్ అంటూ హెచ్చరించారు. ముంబైపై కన్నేసిన ఎంఐఎం, ఇతర ప్రాంతాల్లో ఈ వ్యూహాలను పరీక్షిస్తోందని ఆరోపించారు. దీనిని తాము జరగనిచ్చేది లేదని చెప్పారు.