News

యావత్ ప్రపంచ మేధావులను కదిలించిన ధర్మ శిఖరం నరేంద్రుడు

274views

నంద్యాల జిల్లా నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం స్థానిక సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు స్వామి వివేకానందుని జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది.

రికార్డు లకే పరిమితమై, చరిత్ర మరచిన మహిళా స్వాతంత్ర సమరయోధుల దుర్లభ చిత్రాలు, వారి వివరాలను అధ్బుతంగా ప్రదర్శించారు. ఆహుతులందరూ, నిర్వాహకుల సూచనల మేరకు, మగవారు తెల్ల చొక్కా, ఆడవారు ఎర్ర చీర ధరించి ఐక్కతా స్ఫూర్తిని ప్రదర్శించటమే కాకుండా, పుష్పాంజలి సమర్పించుటకు పూలను పర్యావరణ హిత కాగితపు పొట్లాల లో తెచ్చుకుని స్వాతంత్ర సమరాంగణల పట్ల భక్తిని, పర్యావరణం పట్ల అనురక్తిని చాటారు. ప్రదర్శనలోన్యూక్లియస్ కాలేజ్ విద్యార్థిణులు వీర నారీమణుల జీవిత విశేషాలను చక్కగా వివరించి, ఆహుతులకు స్వాతంత్య్రోద్యమం నాటి సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టారు. ప్రదర్శన తరువాత దేశభక్తి, స్వాతంత్ర కాంక్ష ఏ ఒక్క సామాజిక వర్గానికో, ప్రాతానికో పరిమితం కాదని దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ అవగాహన పొందడం జరిగింది.

తదుపరి ఐ ఎమ్ ఎ మహిళా వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య అధ్యక్షతన సమావేశమైన వేదిక పై ప్రధాన వక్త ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాకా లోకం యూ ట్యూబ్ చానెల్ వ్యవస్థాపకులు, ఈశాన్య రాష్ట్రాలలో సంఘ్ ప్రచారక్ గా విశేష సేవలందించిన శ్రీ రాకా సుధాకర్, డాక్టర్ వసుధ, నంద్యాల ఐయమ్ఏ మహిళా వైద్యలవిభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద, శ్రీమతి సరిత, శ్రీ రామకృష్ణా పీజీ కాలేజ్ డీన్ శ్రీమతి ప్రగతి వేదికపై ఆసీను లయ్యారు.

తదుపరి భరతమాత, స్వామి వివేకానంద, బంకించంద్ర చటర్జీ చిత్రపటాలకు పూజచేసి, మాలాలం కృతులను చేశారు. తదుపరి వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకుని పూర్తి గీతాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది.

 

స్థానిక ప్రఖ్యాత చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ చిత్రించిన స్వామి వివేకానంద చిత్రాన్ని ప్రధాన వక్త శ్రీ రాకా సుధాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అతి తక్కువ కాంతితో, మంద్రమైన సంగీతంతో వివేకానందుని భజన్ తో ఆయనను మదిలో నిలుపుకొని అందరూ ధ్యానం చేయడం జరిగింది.
తదుపరి శ్రీ శారద విద్యాపీఠం కొత్తపల్లి విద్యార్థినుల వివేకానందుని గీతానికి యోగచాప్ సామూహిక ప్రదర్శన అందరినీ అలరించింది.

చిత్రం ప్రదర్శన వల్ల ప్రతి ఒక్కరూ మానసికంగా స్వాతంత్ర ఉద్యమం నాటి స్మృతుల్లోనికి వెళ్ళడమే కాకుండా వివేకానందుని మదిలొ నిలిపి ధ్యానం చేయడం వల్ల ఒక విధమైన అలౌఖిక ఆనందానికి గురి కావడం జరిగింది.

వక్త సందేశంలో అతి తక్కువ కాలంలో యావత్ ప్రపంచ మేధావుల ను కదిలించిన ధర్మ శిఖరం నరేంద్రుని జీవన సాగరాన్ని మధించి, సోధించి, సాధించిన వజ్ర వైడూర్యాల లాంటి అపురూప సంఘటనలను సభికుల ముందు పరిచి ఆ తేజోమూర్తి అసమాన మూర్తి మత్వాన్ని అందరి హృదయాలలో ఆవిష్కరించారు. వక్త తన అసమాన జ్ఞాన సంపద తో చాలా మందికి తెలియని అపురూప అంశాలను బహిర్గత పరచి అందరిని అబ్బుర పరిచారు.

సదరు కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులతో పాటు ఎందరో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమ విజయానికి అహరహం పాటు పడటమే కాకుండా హార్థిక గా, ఆర్థికంగా తోడ్పాటు నందించారు. నేషనలిస్టు ఎలైట్ ఫోరం ఇటివలే ప్రారంభింప బడినప్పటికీ తన మూడవ కార్యక్రమంగా ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని, ఇంత అద్భుతంగా నిర్వహించి నందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు.