News

దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి

180views

ప్రజలంతా భక్తిభావంతో దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ ఆదిత్య తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో సొలభం పంచాయతీ గొడుగుమామిడి గ్రామంలో భక్తిశ్రద్ధలతో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమిలికి చెందిన సద్గురు సాయిరాం స్వామీజీ మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు.హిందూ సంప్రదాయాలు, విలువలను కాపాడుకోవడానికి, ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సంఘటితంగా పనిచేయాలని, మతమార్పిడులను నివారించి, ధర్మాన్ని ఆచరించి, భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. ధర్మాన్ని రక్షించడం ద్వారానే మనం రక్షించబడతామని తెలిపారు.

కార్యక్రామనికి హాజరైన అతిథులకు గిరిజన సంప్రదాయంగా అడ్డాలకుతో తయారు చేసిన గిడుగులతో సన్మానించారు. విల్లంభులను అందజేశారు. థింసా నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎస్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా పరియోజన ప్రముఖ్‌ మత్స్యరాస మత్స్యరాజు, ఎస్‌ఎస్‌ఎఫ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కొండబాబు, లక్ష్మి, నీలకంఠం, భాస్కరరావు, వరహాలమ్మ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.