
175views
అనంతపురం నల్లచెరువు మండలంలోని దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్.. పాకిస్థాన్‌కు అనుకూలంగా పెట్టిన ఓ వీడియో దుమారం రేపింది. ఇతడు కొన్నేళ్ల క్రితం హిందూ మతాన్ని ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. సోషల్‌మీడియాలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ వీడియోను పోస్ట్ చేశాడు.
దీనిపై మండలానికి చెందిన యువకులు నల్లచెరువు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియో పోస్ట్ చేసిన ధనుంజయ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.





