News

దత్త జయంతి బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేసిన దుండగులు…

84views

కర్నాటకలోని చిక్కమంగళూరులో వివాదం రేగింది. దత్త జయంతి సందర్భంగా హిందూ సంస్థలు కట్టిన బ్యానర్లను దుండగులు చించిపారేశారు. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐ.జీ, రోడ్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు చేసిన ప్రయత్నమే ఇది అని హిందువులు ఆరోపిస్తున్నారు.

మరో రెండు రోజుల్లో శ్రీ దత్త జయంతి పర్వదినం రాబోతోంది. ఈ సందర్భంగా వీటికి సంబంధించిన సన్నాహాల్లో హిందువులు మునిగిపోయారు. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల్లో దత్త జయంతికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చాలా మట్టుకు శ్రీ దత్తుడు వున్న ఫోటోలే వున్నాయి. వాటిని కూడా దుండగులు చించేశారు. భక్తులను తమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నంలో భాగంగానే వీటిని ఏర్పాటు చేస్తున్నామని భక్తులు ప్రకటించారు.

అయితే, ఐ.జి. రోడ్డులోని ఉర్దూ పాఠశాల ముందు ఉంచిన ఈ బ్యానర్లలో చాలా వాటిని ఉద్దేశపూర్వకంగా బ్లేడుతో చించేసినట్లు హిందువుల దృష్టికి వచ్చింది. దీంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. తమ భక్తి భావాలను, మనోభావాలను దుండగులు దెబ్బ తీశారని హిందువులు ఆందోళనకు దిగారు. పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుల కదలికలను తెలుసుకోవడానికి ఐ.జి. రోడ్డు వెంట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.