News

సత్యసాయి బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయి: ద్రౌపది ముర్ము

134views

పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) వ్యాఖ్యానించారు. శనివారం) బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతికి సీఎం, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు.

సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. బాబా సందేశంతో కోట్లాదిమంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానన సేవే మాధవ సేవ అని బాబా భావించేవారు. సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారు. చాలామంది సత్యసాయి భక్తులు దేశ, విదేశాల్లో ఉన్న పేద వారికి సేవలందిస్తోన్నారు. 1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారు. దీన్ని అందరూ పాటించాలి. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలి’ అని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు.సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కీర్తించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు