
గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక స్వావలంబన మరియు ఆరోగ్యం కోసం గోఉత్పత్తుల ప్రశిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 24 నుండి 31 వరకు అలాగే మరియు నవంబర్ 8,9 తేదీలలో అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల మరియు ప్రకాశం జిల్లాలలో రెండు మూడు రోజుల చొప్పున నిర్వహించారు. ఈ సందర్భంగా గోవుపేడ గోమూత్రంతో ధూపం, పిడకలు, అమృతధార, జండూ బామ్, దివ్యధార, పంచగవ్య కృతం, పళ్ళపొడి, ఫినాయిల్, పిల్స్, వ్యవసాయానికి సంబంధించి కీటకనివారిణి వంటి 10 రకాల ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 60 మంది మహిళలు 90 మంది పురుషులు పాల్గొన్నారు.
నిర్వహణ ప్రశిక్షణలో గ్రామ వికాస్ ప్రాంత సంయోజక్ శ్రీ తిరుపతయ్య గ్రామ వికాస్ ప్రాంత స్వావలంబన ప్రముఖ్ శ్రీ ఢమాం సురేశ్ గ్రామ వికాస్ ప్రాంత ఆరోగ్య ప్రముఖ్ శ్రీ పత్తి రామ్మూర్తి గోసేవా ప్రాంత సంయోజక్ శ్రీ రామ్జీ మరియు స్థానిక గ్రామ వికాస్ విభాగ్ జిల్లా ఖండ సంయోజకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు





