
కృష్ణా యూనివర్సిటీ శాఖ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ – ఏబీవీపి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో శ్రీ శక్తి దివస్ & ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కృష్ణా యూనివర్సిటీ ఏబీవీపి ప్రెసిడెంట్ ఝాన్సీ మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి జీవీతం ప్రతి మహిళకు ఆదర్శనీయమని అన్నారు. ఝాన్సీ రాణి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తొలి మహిళా యోధురాలు.ఆమె ధైర్యం, నాయకత్వం, దేశభక్తి అనేవి అమ్మాయిలకు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడికి ప్రేరణ అని తెలిపారు.
1857 స్వాతంత్ర్య సమరంలో “నేను పోరాడితేనే జీవిస్తాను, దేశం కోసం ప్రాణం ఇస్తేనే నా జీవితం సార్థకం!” అని తెలియజేస్తూ, 21 ఏళ్ళ వయసులోనే దేశం కోసం ప్రాణం అర్పించడం ఆమె మహోన్నతతకు నిదర్శనమన్నారు.
“ధైర్యం, నిర్ణయం, విద్య — ఇవే మహిళా శక్తికి ఆయుధాలు” అని ఆమె జీవితం మనకు చెప్తున్న సందేశం అని చెప్పారు. మహిళలు ముందడుగు వేస్తేనే “వికసిత భారత్” సాధ్యమని ఝాన్సీ గారు పేర్కొన్నారు.శ్రీ శక్తి దివస్ ద్వారా స్త్రీ శక్తిని గౌరవించడం, ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరించుకుంటూ యువతలో ధైర్యం మరియు సేవ భావనను పెంచడం స్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.





