
విజయవాడ దుర్గగుడి భవానీ దీక్షల విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై మహామండపం 4వ అంతస్తులోని ముఖ్య సమావేశం ఆలయ ఈవో శీనా నాయక్ సమీక్ష నిర్వహించారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సమావేశంలో చర్చించారు. స్నాన ఘట్టాలు వద్ద ఏర్పాట్లు, భవానీల దర్శనం ఏర్పాట్లు క్యూ లైన్లు, ఇరుముడి సమర్పణ పాయింట్లు, హోమ గుండాల ఏర్పాటు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, అన్న ప్రసాదం పంపిణీ, ప్రసాదం కౌంటర్లు, భక్తుల నిష్క్రమణ మార్గాలు వంటి చర్యలు సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు.ఈ సమావేశ అనంతరం మహా మండపం దిగువ భాగాన హోమ గుండాలు ఏర్పాటు చేసే ప్రాంతం, భవాని దీక్షలు ధరించిన భక్తులు తమ ఇరుముడులు సమర్పించే ప్రాంతం, భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసే ప్రాంతం, దుర్గా ఘాట్ తదితర ప్రాంతాల్లో ఈవో చైర్మన్ ఆలయ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.





