News

నాడు సేతువుకు.. నేడు స్వగృహానికి

237views

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవడం ఓ కల. అన్ని ప్రణాళికలు వేసుకున్నాక.. చక్కటి ముహూర్తం చూసి శంకుస్థాపనతో గృహనిర్మాణం ప్రారంభిస్తారు. చాలా మంది రామభక్తులు.. తాము ఇంటి నిర్మాణం ప్రారంభించేటప్పుడు మొదటి ఇటుకపై రామనామం రాసి వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి రామాలయం భక్తులకు ఇటుకలను కానుకగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఎర్రమట్టి, ఇసుక, సిమెంట్‌ మిశ్రమంతో దాదాపు కిలోన్నర బరువు గల ఇటుకలను ఆలయ యాజమాన్యం అందుబాటులోకి తేనుంది. వీటిపై ‘జైశ్రీరామ్‌’ అనే నామం ఉంటుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ చొరవ తీసుకుని.. ఇటుకల తయారీకి బెంగళూరు నుంచి ప్రత్యేక యంత్రాన్ని రప్పించి మంగళవారం ఆలయానికి అందించారు. శ్రీరామచంద్రుని దర్శనానికి వచ్చిన వారే సొంతంగా ఇక్కడ రెండు అంతకు మించి ఇటుకలను తయారు చేయవచ్చు. ప్రతి ఇటుకకు కొంత రుసుము నిర్ణయించనున్నారు.