News

మదర్సాల లెక్క తేల్చండి – శ్రీలంక ప్రధాని ఆదేశం

138views

న్ని ముస్లిం మత పాఠశాలలను (మదర్సాలు) నమోదు చేయాలని శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్సే ముస్లిం మత వ్యవహారాల శాఖను ఆదేశించినట్లు శ్రీలంక వార్తాపత్రిక డైలీ మిర్రర్ నివేదించింది.

అన్ని మదర్సాల పాఠ్యాంశాలను సమీక్షించాలని, విద్యా మంత్రిత్వ శాఖ సహాయంతో నవీకరించబడిన పాఠ్యాంశాలను సిద్ధం చేయాలని రాజపక్సే విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ముస్లిం యువతలో తీవ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశం మదర్సాలపై కఠినమైన నిబంధనలను విధించింది.

పొరుగు దేశం తన మదర్సాలను నియంత్రించడానికి కఠినమైన ఉత్తర్వులను జారీ చేయడంతో, భారతదేశంలో పౌర సమాజం యొక్క దీర్ఘకాల డిమాండ్ మళ్లీ చర్చనీయాంశమైంది. భారతదేశం అంతటా ముస్లిం యువతకు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ లలో బోధనలో ప్రభుత్వాల నియంత్రణ లేని మదర్సాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

2016 లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) నివేదిక ప్రకారం, ఐసిస్‌లో చేరిన వారిలో 20 శాతం మంది మదర్సాలలో విద్యాభ్యాసం చేసిన వారే. భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించి ఇటీవల అరెస్టైన వారిలో, అనేక మంది మదర్సా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో, మదర్సాలు ఉగ్రవాదులకు ఆశ్రయాలు కల్పించినట్లు కూడా తేలింది.

గత సంవత్సరం, గోరియా మోరియా దేశి జతియా పరిషత్ అనే ఒక అస్సామీ ముస్లిం సంస్థ, రాష్ట్రంలోని మదర్సాల్లో విద్య యొక్క నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నమోదుకాని మత పాఠశాలలను నియంత్రించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేసింది.  క్రమబద్ధీకరించని సంస్థలు మత ఛాందస వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని కూడా ఆరోపించింది.

Source : Organiser

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.