NewsSeva

ఉపాధ్యాయులకు ఆరోగ్య అవగాహన సదస్సు

171views

నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, ఆహారపు అలవాట్లపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.

డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ షుగర్, బీపీ తదితర వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.

హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య గుప్త మాట్లాడుతూ టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులు, నెమ్ము, అలర్జీ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను విశదీకరించారు.

 ఈ కార్యక్రమంలో సీనియర్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టీ వై కృష్ణ, హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీ గురు ప్రసాద్, సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ హరి కుమార్ రెడ్డి, కోశాధికారి శ్రీ గుర్రం సుధాకర్, ఉపాధ్యాయ నాయకులు శ్రీ పూడి ప్రసాద్, శ్రీ సుబ్బరాజు, శ్రీ ఆర్ ఆర్ ఎస్ ప్రసాద్, శ్రీ రమేష్, శ్రీ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.