
దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ పై అవకాశం వచ్చినప్పుడల్లా విషం కక్కుతునే ఉంటుంది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ ను దేశంలో నిషేధించాలని మళ్ళీ అదే పాట పాడారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. స2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దానిని తిరిగి అమలు చేయాలని కోరారు. ‘‘ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని ఖర్గే అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన విషంతో పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు
కర్ణాటకలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశాడు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నియంత్రించింది. అయితే ఈ చర్యల్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కోసం పనిచేయకూడదని సర్దార్ పటేల్ గతంలో అన్నారు. జూలై 9, 2024న మోడీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిషేధాన్ని తిరిగి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము’’ అని ఖర్గే అన్నారు.
అయితే, ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ 50 ఏళ్లుగా పటేల్ సేవల్ని విస్మరించిందని, ఆయన సహకారాన్ని తక్కువ చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయన అడుగుజాడల్ని అనుసరించలేదని, ఆర్ఎస్ఎస్‌ను వ్యతిరేకించడానికి సర్దార్ పేరును ఉపయోగిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.
‘‘ INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. అది ఇండియన్ నాజీ కాంగ్రెస్. కాంగ్రెస్ కుట్రలు అన్నీ ఉన్నప్పటికీ, కోర్టు RSSపై నిషేధాన్ని ఎత్తివేసింది. RSS ఒక రాజకీయేతర సంస్థ అని, ప్రభుత్వ ఉద్యోగులు వారి కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని వారు చెప్పారు. కానీ కాంగ్రెస్ చాలా అసహనంగా ఉంది, వారు PFI, SDPI, MIM అల్లర్లకు మద్దతుగా నిలుస్తారు కానీ దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న RSSపై విషం కక్కుతున్నారు’’ అని ఆయన అన్నారు.





