
193views
చిత్రంలో కనిపిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడి పేరు దీపక్‌శర్మ. స్వస్థలం హరియాణా రాష్ట్రం పానిపట్. చార్‌ధామ్ సందర్శన పేరుతో మే 25న సైకిల్ యాత్ర ప్రారంభించిన అతను ఐదు మాసాల్లో 6,500 కి.మీ. ప్రయాణం పూర్తిచేశారు. సైనికుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ ఆపరేషన్ సిందూర్ వివరాలతో ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్ ధరిస్తున్నారు. నీటిసంరక్షణ, మొక్కల పెంపకం, పరిశుభ్రత, యోగా, వ్యాయామం, పేదవారికి సాయం చేయడం వంటి తొమ్మిది తీర్మానాలతో దేశంలోని నాలుగు ప్రధాన ఆలయాలు దర్శించుకుంటూ వెళ్తున్నారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కలవడానికి అమరావతికి వెళ్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.





