
211views
శైవక్షేత్రాల్లో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరాలయంలో మాత్రం విగ్రహ రూపంలో వెలిశాడు. క్షీరసాగర మథనంలో శివుడు హాలాహలాన్ని తాగిన అనంతరం కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యలో తీవ్ర అలసటతో పార్వతీదేవి ఒడిలో సేదతీరాడని ప్రతీతి. ఆ గాథ ప్రకారం సర్వమంగళాదేవి ఒడిలో పరమేశ్వరుడు పడుకుని ఉన్న రీతిలో 12 అడుగుల భారీ విగ్రహ రూపంలో కొలువుదీరాడు. స్వామిని చూడటానికి బ్రహ్మ, విష్ణువులతో పాటు సకల దేవగణాలు, రుషులు ఇక్కడికి రావడంతో ఈ క్షేత్రానికి సురుటుపల్లిగా (సురులు వచ్చిన ప్రాంతం), పడుకుని ఉన్న స్వామికి పల్లికొండేశ్వరుడిగా పేరు వచ్చింది. తిరుపతి నుంచి 72 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.




