News

ఆర్‌ఎస్‌ఎస్‌పై కర్ణాటకలో ఆంక్షలు

205views

కర్ణాటకలో కాంగ్రెస్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌పై పరోక్షంగా ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక సర్క్యులర్‌ను జారీచేసింది.

‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయా అభ్యర్థనల తర్వాత ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు.

ఇకపై స్థానిక పాలనా యంత్రాంగానికి ఊరకే ముందస్తు సమాచారం ఇచ్చేసి రహదారులపై కర్రలు ఊపుతూ కవాతులు, మార్చ్‌లు, పథ సంచలన వంటి కార్యక్రమాలు చేస్తామంటే కుదరదు. బహిరంగ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌ స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో కొత్త నియమ నిబంధనలు అమలు చేయబోతున్నాం’’ అని ప్రియాంక్‌ చెప్పారు.

కర్ణాటక వ్యాప్తంగా ఆరెస్సెస్‌ కార్యకలా పాలను నిషేధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్‌ లేఖ రాసిన రెండు వారాలకే కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తుండటం గమనార్హం.