
137views
పూల లోహంతో (ఫ్లవర్ మెటల్) తయారైన పూజా సామగ్రి త్వరలో అయోధ్యలోని రాంలల్లా సేవలో తరించనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో వీటిని తయారు చేశారు. ఆ నగరంలోని మెటల్ ఇండస్ట్రీ వారు దీనిని తయారు చేయించారు. వీటికి ఆయుర్వేద గుణాలుంటాయని తయారీదారులు చెబుతున్నారు. వాటిని శ్రీరాముడి నైవేద్యానికి వినియోగించనున్నారు. ఈ సామగ్రిలో 24 ప్లేట్లు, 72 బౌల్స్, 24 గ్లాసులు, 24 వడ్డించే ప్లేట్లు, 24 చెంచాలున్నాయి. ఇందులోని ఆయుర్వేద గుణాలు ఆరోగ్యానికి మంచిదని తయారీదారులు చెబుతున్నారు.





