
భారతదేశంలో తొలిసారి ఫ్రాంచైజీ విధానంతో నడిచే ఆర్చరీ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సూపర్‌స్టార్ రామ్ చరణ్ చేత ఈ టోర్నమెంట్ ప్రారంభించబడింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు నడిచే ఈ ఈవెంట్, భారతీయ ఆర్చరీని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చేత నిర్వహించబడుతోంది.
రామ్ చరణ్, తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆర్చరీ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న వ్యక్తిగా ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “ఆర్చరీ అంటే క్రమశిక్షణ, దృష్టి, స్థిరత్వం – ఇవి నేను లోతుగా గౌరవిస్తున్న విలువలు. ఏపీఎల్ ద్వారా భారతీయ ఆర్చరీ ప్రపంచాన్ని ప్రేరేపించాలని ఆశిస్తున్నాను, ఆర్చరీతో తన అనుబంధం గురించి చెప్పుకున్నాడు. రామాయణ మహాభారతాలతో ఉన్న విలువిద్యకి ఆర్చరికి అనుబంధం ఉందని తెలిపారు.





