News

ఇంద్రకీలాద్రిపై ప్రొటోకాల్‌ దర్శనం వేళలు మార్పు

184views

దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనార్థం ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే వారి దర్శన వేళలను నుంచి కుదిస్తూ ఆలయ ఈవో శీనా నాయక్‌ ఆదేశాలు జారీ చేశారు. పండగ నేపథ్యంలో సాధారణ భక్తులకు దర్శనం అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో వెల్లడించారు.

ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9 వరకు, సాయంత్రం 3 నుంచి 5 వరకు ప్రొటోకాల్‌ దర్శనం ఉంటుంది. గురువారం నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రొటోకాల్‌ పరిధి లోకి వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ వ్యవస్థల వారికి అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో తెలిపారు.