News

సూర్యుడిపై సీతాకోకచిలుక

226views

భగభగ మండే సూర్యుడిపై సీతాకోకచిలుక ఏమిటంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఒక్క క్షణం ఆగండి! ఆ కీటకం ఆకృతిలో సూర్యగోళం బాహ్య పొరల్లో 5 లక్షల కి.మీ. విస్తీర్ణంతో ఏర్పడిన భారీ రంధ్రం ఇది. నాసాకు చెందిన సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ ఈ నెల 11న ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించింది. ఈ భారీ రంధ్రం నుంచి వెలువడుతున్న సౌర గాలులు ఈ నెల 14న భూమిని తాకే అవకాశం ఉందని, దీనివల్ల స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తరు భూఅయస్కాంత తుపానులు ఏర్పడవచ్చని నాసా తెలిపింది. ఈ క్రమంలో అంతరిక్ష వాతావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనీ పేర్కొంది. ఉపగ్రహాల కార్యకలాపాలకు, సాంకేతిక వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి, సూర్యుడికి మధ్య ఏర్పడే అయస్కాంత క్షేత్రాల అనుసంధానతపై అధ్యయనాలు జరిపేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నారు.