
140views
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హరిహరపురం మఠాధిపతి శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచేతొలిసారిగా హిందూ శోభాయాత్ర నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆయన పుంగనూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందువులు ఏకమై స్వామి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారు శ్రీచక్రన వారణ పూజా కార్యక్రమాలు సాయంత్రం ని ర్వహించి, భక్తులకు ఉపదేశం ఇచ్చారు. హిందువులు ఐకమత్యంతో ఉండాలని, శాంతి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.





