News

కేరళలో ఓనం ముగ్గు వివాదంపై హిందూ సంఘాల నిరసనలు

227views

కేరళ కొల్లంలోని శాస్తంకోటలోని ముతుపిలక్కట్ పార్థసారధి ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఓనం పూక్కలంను (ఓనం ముగ్గు) కేంద్ర మంత్రి సురేష్ గోపి సందర్శించారు…ముందుగా మంత్రి ఆలయం లో ప్రార్థనలు చేసి, ఓనం వేడుకల్లో భాగంగా పూక్కలం మీద సిందూరం చల్లారు. ఆ తర్వాత అక్కడ గుమిగూడిన ప్రజలకు సిందూరం పంచారు. పూక్కలం ఏర్పాటుకు సంబంధించి నమోదైన కేసులో సైనికుడు అశోకన్‌ను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు సహా వేలాది మంది ఆలయం ముందు గుమిగూడారు. కేంద్ర మంత్రి భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రిని స్వాగతించడానికి బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.

కేరళ ఓనం వేడుకల్లోభాగంగా శాస్త్రం కోట ముత్తుపిలక్కడ్ పార్ధసారధి ఆలయం ముందు నేలపై ఆపరేషన్ సింధూర్ తో పాటుగా, పూలతో కాషాయ జెండాను కూడా వేశారు. ఇలా వేసినందుకుగానూ ఒక సైనికుడు, మరొక మాజీ సైనికుడతో పాటుగా 27 మందిపై కేరళపోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే…అయితే ఈ చర్యకు హిందుత్వవాదులు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం ఆపరేషన్ సిందూర్ ను మెచ్చుకుంటుంటే దేశద్రోహులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక పూక్కలం నిర్వాహకులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రమంతటా అనేక ప్రాంతాలలో బిజెపి, సంఘ్ ప్రేరేపిత సంస్థలు సహా అనేక హిందూ సంస్థలు తమ నిరసనలను తీవ్రతరం చేశాయి. . భారతీయ జనతా యువ మోర్చా కూడా వేలాది మంది యువకులను సచివాలయానికి నడిపించింది, అక్కడ వారు కూడా “ఆపరేషన్ సిందూర్” పూక్కలం ఏర్పాటు చేశారు.