News

అభివృద్ధికి దోహదం చేసే రైల్వే ట్రాక్ నిర్మాణానికి అడ్డుపుల్లగా క్రైస్తవ చర్చి

166views

హోస్పేట్, వాస్కోడా మధ్య సౌత్ర్ వెస్ట్రన్ రైల్వే చేపట్టిన డబుల్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కి క్రైస్తవ చర్చి (ఆర్చిడియోసిస్ ఆఫ: గోవా అండ్ డామన్) అడ్డంపడుతోంది. ఈ ప్రాజెక్టును చర్చి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిజానికి ఈ రైల్వే ప్రాజెక్టుతో ప్రజలకు బాగా మేలు కలుగుతుందని, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు రవాణాను మరింత వేగవంతం చేస్తుందని రైల్వే శాఖ పేర్కొంది. అంతేకాకుండా గోవా పర్యాటకం కూడా మరింత మెరుగవుతుందని పేర్కొంటోంది. కానీ.. క్రైస్తవ చర్చి మాత్రం తీవ్రంగా అడ్డుతగులుతోంది.

ఈ ప్రాజెక్టులోని 363 కిలోమీటర్లలో, కర్ణాటకలో 312 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తైందని రైల్వే ప్రకటించింది. గోవాలో 51 కిలోమీటర్లు అలాగే వుండిపోయిందని, డిసెంబర్ 2026 నాటికి పూర్తి కావాల్సి వుందని రైల్వే తెలిపింది.

రెండు రోజుల క్రిందటే గోవా మరియు డామన్ ఆర్చ్ డయోసెస్ యొక్క డియోసెసన్ కమిషన్ ఫర్ ఎకాలజీ డబుల్-ట్రాకింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ బోల్మాక్స్ పెరీరా నేతృత్వంలో, కమిషన్ పర్యావరణ ఆందోళనలు మరియు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉటంకించారు.

మాడీ కోటేగావ్ ప్రాంతానికి టైగర్ రిజర్వ్ ప్రాంతంగా గుర్తింపు వుందని, ఈ క్రమంలో నిర్మాణాలు ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి, ఆరు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది.

డబుల్ ట్రాక్ చేయడాన్ని డియోసెసన్ కమిటీ ఫర్ ఎకోలజీ ఆఫ్ ది ఆర్చిడియోసిస్ ఆఫ్ గోవా అండ్ డామన్ సెప్టెంబర్ మాసంలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సంస్థ కన్వీనర్ నేతృత్వంలోని కమిషన్ పర్యావరణ సమస్యలతో పాటు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ, ఈ రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టును తిరిగి అంచనా వేయాలని, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, స్థిరంగా వుండే అభివృద్ధి నమూనాలను అన్వేషించాలని చర్చి సూచించింది. అలాగే మోర్ముగావ్ పోర్టులో పారిశ్రామికవేత్త అదానీ ప్రమేయంపై రెవరెండ్ డాక్టర్ బోల్మాక్స్ పెరీరా ఆందోళనలు వ్యక్తం చేశారు.

అయితే గోవా ముఖ్యమంత్రి కార్యాలయం క్రైస్తవ చర్చి ప్రతినిధులు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని మరియు బొగ్గుతో సహా ప్రస్తుత సరుకు రవాణాను మెరుగుపరుస్తుందని పేర్కొంది. అలాగే కాలుష్యాన్ని కూడా తగ్గింస్తుందని తెలిపింది.